శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 30, 2020 , 00:05:06

‘ఉపాధి హామీ’పై రైతులకు అవగాహన కల్పించాలి

‘ఉపాధి హామీ’పై రైతులకు అవగాహన కల్పించాలి

కొత్తగూడెం: ఉపాధి హామీ పథకం పనులు వినియోగించేలా రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. రైతువేదికలు, పంట కల్లా లు, ఉపాధి పనులు రైతులకు ఉపయోగపడాలన్నారు. బుధవా రం నుంచి రెండు రోజులు పాటు గ్రామసభలు నిర్వహించి వ్యవసాయానికి, గ్రామానికి ఉపయోగపడే పనులు గుర్తించి అక్టోబర్‌ 2 కల్లా సమగ్ర నివేదికలు అందజేయాలని పేర్కొన్నారు. ఉపాధి పథకంలో రైతులకు ఉపయోగాలు ఉన్నాయని, వాటిని ఎవరు సద్వినియోగం చేసుకుంటున్నారో వారికి ప్రశంసాపత్రాలు అందజేయాలని సూచించారు. వారిని ఎంపిక చేసేందుకు పారామీటర్లను రూపొందించాలని డీఆర్‌డీఓకు తెలిపారు.  నూరుశాతం పశువులకు వ్యాధినిరోధక టీకాలు వేయించాలని వాటి విషయంలో అలసత్వం చేస్తున్న సంబంధిత అధికారిపై అగ్రహం వ్యక్తం చేశారు.  రానున్న వారం రోజులో వంద శాతం టీకాలు వేయాలన్నారు. ఫుట్‌ అండ్‌ మౌత్‌ వ్యాధి చాలా ప్రమాదమైనదన్నారు. సమావేశంలో డీఏఓ అభిమన్యుడు, ఉద్యానవన అధికారి మరియన్న, రైతుబంధు కన్వీనర్‌ కృష్ణారెడ్డి, పాల్గొన్నారు. 

 పత్తి, ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు ఉండొద్దు

పత్తి, వరి విక్రయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడారు. దిగుబడిని బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మొక్కజొన్న సాగును నియంత్రించినందున రికార్డు స్థాయిలో పంటలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి తోడు అధిక వర్షపాతం నమోదు అయిందన్నారు. పత్తి, వరిధాన్యం,అపరాలు ఎక్కువగా వేశారని, నియంత్రిత సాగు సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు. డీఏఓ అభిమన్యుడు. పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్‌, మేనేజర్‌ ప్రసాద్‌, డీసీఓ మైఖేల్‌బోస్‌, పీడీ మధుసూదన్‌రాజు, డీటీఓ జైపాల్‌రెడ్డి, తూనికల కొలతల అధికారి మనోహర్‌, మార్కెటింగ్‌ అధికారి నరేందర్‌, ఆర్డీఓ స్వర్ణలత పాల్గొన్నారు.