శుక్రవారం 23 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 28, 2020 , 00:33:55

నేటి నుంచి ఇంటింటి సర్వే

నేటి నుంచి ఇంటింటి సర్వే

  • గ్రామాలు, పట్టణాల్లో నమోదు ప్రక్రియ 

కొత్తగూడెం: ప్రతి ఇంటికీ పక్కా లెక్క ఉండాలి. ఖాలీ జాగా ఉన్నా పూర్తి వివరాలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో నమోదు కానున్నాయి. దసరా నాటికి ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభం కానుండటంతో ఇంటి లెక్కలు వేసేందుకు తెలంగాణ సర్కారు మరో ముందడుగు వేసింది. నేటి నుంచి అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో సర్వే చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఇప్పటికే ఆయాశాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్న గుడిసె ఉన్నా వారి వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని చెప్పడంతో ఇంటి యజమానులు ఇంటి పత్రాలతో అధికారుల వద్దకు రానున్నారు.

నేటి నుంచి ప్రారంభం కానున్న సర్వే..

ఇంటింటి సర్వేపై స్పష్టత ఇచ్చిన అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి సర్వే ప్రారంభించనున్నారు. జిల్లాలో 481 పంచాయతీల్లో ఇంటి సర్వే చేసి ఇంటి యజమాని ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌ను నమోదు చేయనున్నారు. మున్నిపాలిటీల్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. వచ్చే నెల 2వ తేదీ కల్లా ఈ ప్రక్రియ పూర్తికావాలని అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో నేటి నుంచి నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ప్రతి ఇంటి యజయాని అధార్‌ ఎన్‌రోల్‌ చేస్తారు ..

గతంలో ప్రతి ఇంటి నెంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశాము. ఇప్పడు వారి ఆధార్‌కార్డు నెంబర్లు, సెల్‌ఫోన్‌ నెంబర్లు కూడా తీసుకుని ఆన్‌లైన్‌ చేయనున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కార్యదర్శులు నమోదు ప్రక్రియ చేయనున్నారు.

రమాకాంత్‌, డీపీఓ, భద్రాద్రి కొత్తగూడెం


logo