శుక్రవారం 30 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 27, 2020 , 04:36:50

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

  • నూరు శాతం సబ్సిడీతో చేపపిల్లల పంపిణీ వరం 
  • వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌

వైరా : రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. వైరా రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీతో ఇచ్చిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా  వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తో కలిసి  రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్య సంపద పెంపుదలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. సుమారు రూ.22 లక్షల విలువైన చేప పిల్లలను వైరా రిజర్వాయర్‌కు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందన్నారు. మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌ మాట్లాడుతూ ఈ పథకం దేశానికే ఆదర్శమన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావు, ఏడీ సతీశ్‌, ఎఫ్‌డీవో శివప్రసాద్‌, బుజ్జిబాబు, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు పసుపులేటి మోహన్‌రావు, దార్న రాజశేఖర్‌, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్‌రావు, లయన్స్‌ క్లబ్‌ బాధ్యుడు కాపా మురళీకృష్ణ, మున్సిపాలిటీ కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ బీబా పాల్గొన్నారు.