గురువారం 29 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 26, 2020 , 00:22:48

పేదల ఆస్తుల రక్షణే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

పేదల ఆస్తుల రక్షణే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

  • సత్తుపల్లిలో కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

సత్తుపల్లి: నూతన రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతికి చెందిన వారి ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని దీనికి అనుగుణంగానే దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలందరికీ మెరున్‌ కలర్‌ పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేయడం హర్షణీయమని మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలో టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం స్థానిక రింగ్‌ సెంటర్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ వార్డుల్లో నిర్మించుకున్న ఇండ్లపై ఒక్కపైసా లేకుండా ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్‌ చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూముల పరస్పర కొనుగోళ్లకు సంబంధించిన సాదాబైనామాలను సైతం ఉచితంగా మ్యుటేషన్‌కు అవకాశం కల్పించడం జీవో నెం 58, 59 ఉచితంగా క్రమబద్దీకరణకు అవకాశం కల్పించడం ప్రజల అదృష్టమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుండ్ల కృష్ణయ్య, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఎంపీపీ దొడ్డాహైమావతి శంకర్‌రావు, నాయకులు దొడ్డాకుల గోపాలరావు, వొగ్గు శ్రీనివాసరెడ్డి, అద్దంకి అనిల్‌, చాంద్‌పాషా, వల్లభనేని పవన్‌, దేవరపల్లి ప్రవీణ్‌, గఫార్‌, నడ్డి ఆనందరావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, అమరవరపు కృష్ణారావు, మాధురి మధు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ తోట సుజలా రాణి, పురుషోత్తం, నాగుల్‌ మీరా, మందపాటి రవీందర్‌రెడ్డి తదితరులున్నారు. 


logo