ఆదివారం 25 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 26, 2020 , 00:22:51

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం

  • టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ నూకల నరేశ్‌ రెడ్డి

కూసుమంచి : వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా పార్టీ శ్రేణులు పట్టుదలతో పని చేయాలని వరంగల్‌, ఖమ్మం జిల్లాల తెలంగాణ రాష్ట్ర సమితి ఇన్‌చార్జి నూకల నరేశ్‌ రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులతో శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీని విజయంవైపు నడిపించాయన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతీ ఓటరును కలిసి టీఆర్‌ఎస్‌ చేస్తున్న వాటిని వివరించాలని కోరారు. పట్టభద్రులతో నేరుగా కలిసి టీఆర్‌ఎస్‌ వచ్చిన తరువాత తీసుకున్న వాటిని వివరించడంతో పాటు అన్నివర్గాల వారికి కలిగిన ప్రయోజనాలను వివరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆర్‌జేసీ కృష్ణ  కూసుమంచి, ఖమ్మంరూరల్‌, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం నాలుగు మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ, చాట్ల పరశురాం, పాశబోయిన వీరన్న, మండల పరిషత్‌ అధ్యక్షులు బెల్లం ఉమ, బానోత్‌ శ్రీనివాస్‌, బోడామంగీలాల్‌, వజ్జా రమ్య, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌, సుడా డైరెక్టర్‌ గూడ సంజీవరెడ్డి, రూరల్‌ కార్యదర్శి రెడ్యానాయక్‌, నాయకులు చావా శివరామకృష్ణ, నెల్లూరి లీలా ప్రసాద్‌, నంబూరి సత్యనారాయణ పాల్గొన్నారు. 



logo