గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 26, 2020 , 00:22:54

అన్నదాత ఆనందోత్సాహం

అన్నదాత ఆనందోత్సాహం

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
  • నూతన రెవెన్యూ చట్టం పట్ల రైతుల హర్షం
  • రెవెన్యూ చట్టానికి సంపూర్ణ మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో 
  • రైతులు భారీ ట్రాక్టర్‌ ర్యాలీ 
  • సీఎం కేసీఆర్‌ రైతుల పాలిట దేవుడు
  • మణుగూరు జడ్పీటీసీ నర్సింహారావు

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతన్నలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు కర్షకులు కదిలివస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. భూ సమస్యలకు చక్కని పరిష్కారం చూపిన భూమి పుత్రునికి జేజేలు పలుకుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగాఅన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ చిత్రపటాలకుక్షీరాభిషేకాలు చేస్తూ ‘జయహో కేసీఆర్‌' అంటూ నినదిస్తున్నారు. కిలోమీటర్ల పొడవునా ప్రదర్శన చేపడుతూ పటాకులు కాలుస్తూ సందడి చేస్తున్నారు.   

శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మణుగూరు ఏరియా ఓల్డ్‌స్టోర్‌ వద్ద గ్రౌండ్‌ నుంచి ట్రాక్టర్లతో బయలుదేరి అంబేద్కర్‌ సెంటర్‌కు వరకు పెద్దఎత్తున ర్యాలీ   నిర్వహించారు. ఆనందంతో రైతులు, టీఆర్‌ఎస్‌  నాయకులు,ప్రజా ప్రతినిధులు ప్రతి కూడలిలో భారీగా పటాకులు కాలుస్తూజై కేసీఆర్‌, జైజై కేసీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 

 

మణుగూరు: నూతన రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మణుగూరు మండల కేంద్రంలో మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మణుగూరు ఏరియా ఓల్ట్‌స్టోర్‌ వద్దగల గ్రౌండ్‌ నుంచి మణుగూరు లారీ ఆఫీస్‌, పూలమార్కెట్‌ మీదుగా అంబేద్కర్‌ సెంటర్‌ వరకు అక్కడ నుంచి మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ మీదుగా అంబేద్కర్‌ సెంటర్‌కు వరకు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఆనందంతో రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి కూడలిలో భారీగా పటాకులు కాలుస్తూ జై కేసీఆర్‌, జైజై కేసీఆర్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఈ ర్యాలీని  మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు ఓల్ట్‌స్టోర్స్‌ గ్రౌం డ్‌ వద్ద  రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో  రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చి రైతుల పాలిట దేవుడయ్యారని అన్నారు. అన్ని రకాలుగా రైతులకు ప్రయోజనం కలగాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అన్ని రంగాల్లో రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు. మండలంలోని అన్ని వర్గాల రైతులు భారీ సంఖ్యంలో తరలివచ్చి నూతన రెవెన్యూ చట్టానికి సంపూర్ణ మద్దతుగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకువచ్చి కొత్త రెవెన్యూ చట్టంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం పట్ల ప్రతి గ్రామంలో రైతులు ఆనందంతో సంబురాలు జరుపుకుంటున్నారని,  భూ సమస్యలు ఇక శాశ్వతంగా పరిష్కారం అవుతాయన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టారని, రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి రైతుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్యాక్రమంలో ఎంపీపీ కారం విజయకుమారి, పీఏసీఎస్‌ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ కేవీ రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు దొబ్బల వెంకటప్పయ్య, మణుగూరు ఏరియా టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకరరావు,  డి.వీరభద్రయ్య, మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ముత్యంబాబు, అడపా అప్పారావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొలిశెట్టి నవీన్‌, సెక్రెటరీ ఆవుల నర్సింహారావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్‌, ముద్దంగుల కృష్ణ, ఏనిక ప్రసాద్‌, సకిని బాబురావు, తెల్లం నర్సింహారావు, గుడిపూడి కోటేశ్వరావు, పుచ్చకాయల శంకర్‌, రుద్ర వెంకట్‌, గుండగాని నాగేశ్వరరావు, ఉడుతాని రవి, కాయం తిరుపతమ్మ, కారం ముత్తయ్య, కనితి బాబురావు, తంతరపల్లి కృష్ణ, ఆర్‌. వెంకటరెడ్డి, చింతల కృష్ణ, గంగాధర్‌, బాడిశ నాగేశ్వరరావు, సత్యనారాయణ, గువ్వా రాంబాబు, కత్తి రాము, కుర్రం శ్రీను, పప్పుల ప్రసాద్‌, భిక్షపతి, అడపా వెంకటేశ్వర్లు, మచ్చా సమ్మక్క, రమాదేవి, చంద్రకళ, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, మండల, టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.