బుధవారం 28 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 25, 2020 , 01:29:06

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం

  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, జిల్లా ఇన్‌చార్జ్‌ నూకల నరేశ్‌రెడ్డి
  •  కొత్తగూడెం క్లబ్‌లో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం
  • హాజరైన ఎమ్మెల్యే వనమా 
కొత్తగూడెం అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష అని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు.

వందకు వందశాతం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. అనంతరం పార్టీ రాష్ట్ర నాయకుడు, జిల్లా ఇన్‌చార్జ్‌ నూకల నరేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్య మాట్లాడుతూ.. ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్‌ఎస్‌ విజయం తధ్యమన్నారు. 

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి రాష్ట్రంలోని కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని, నిరుద్యోగాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ సన్నాహక సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు బాదావత్‌ శాంతి, భూక్యా సోనా, భూక్యా విజయలక్ష్మి, సరస్వతి, జడ్పీటీసీ బిందు చౌహాన్‌, బరపాటి వాసుదేవరావు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వేల్పుల దామోదర్‌, పాల్వంచ సొసైటీ వైస్‌ చైర్మన్‌ కాంపెల్లి కనకేశ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 


logo