మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 25, 2020 , 00:45:50

పట్టభద్రుల ఓటు నమోదు కీలకం

పట్టభద్రుల ఓటు నమోదు కీలకం

  • టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

మణుగూరు: పట్ట భద్రుల ఓటు నమోదే కీలకమని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు కార్యక్రమాన్ని విజయవంతగా పూర్తయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఆయన గురువారం టెలీ కాన్పరెన్స్‌ ద్వారా మణుగూరు మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో మాట్లాడారు. 2017 లో అంతకు ముందు డిగ్రీ, ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పట్ట భద్రులు తప్పనిసరిగా ఆక్టోబర్‌ 1న నుంచి నవంబర్‌ 6 వరకు ఓటు నమోదు దరఖాస్తు చేసుకోవాలన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమన్నారు.

ప్రజల ఆశీస్సులు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉన్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో  టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో  జడ్పీటీసీ పోశం నర్సింహారావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ కేవీరావు, మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు ముత్యంబాబు, అడపా అప్పారావు, ఆవుల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొలిశెట్టి నవీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, యువజన నాయకులు మట్టపల్లి సాగర్‌ యాదవ్‌, జి. కోటేశ్వరరావు, రుద్ర వెంకట్‌, రవి ప్రసాద్‌, సృజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయం

 రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు అన్నారు. ఆయన గురువారం మణుగూరు మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్క టీఆర్‌ఎస్‌ కార్యకర్త, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు. 

నేడు ట్రాక్టర్లతో ర్యాలీ 

ఈ నెల 25న మణుగూరు పట్టణంలో నూతన రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భారీ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జడ్పీటీసీ పోశం నర్సింహారావు తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ ర్యాలీ  ఉదయం 9:00 గంటలకు మణుగూరు సింగరేణి ఓల్డ్‌స్టోర్‌ వద్దగల గ్రౌండ్‌ నుంచి ప్రారంభమై  అశోక్‌నగర్‌ మీదుగా అంబేద్కర్‌ సెంటర్‌ వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

బూర్గంపహాడ్‌: రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌ గురువారం జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు మండల అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీశ్‌, సొసైటీ చైర్మన్‌ బిక్కసాని శ్రీనివాసరావు,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.