శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 25, 2020 , 00:23:08

ఓసీ-2లో వైభవంగా దుర్గా హోమం

ఓసీ-2లో వైభవంగా దుర్గా హోమం

మణుగూరు రూరల్‌: సింగరేణి ఏరియాలోని ఓసీ-2 గనిలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆశ్వియుజ మాసం సందర్భంగా గురువారం దుర్గాహోమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. పీకే ఓసీ ప్రాజెక్ట్‌ అధికారి లక్ష్మీపతిగౌడ్‌, ప్రాజెక్ట్‌ మెనేజర్‌ మాలోతు రాముడు దంపతులు, సత్యనారాయణ దంపతులు పలువురు కార్మికులు హోమంలో పాల్గొని  పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ దండమూడి రాంబాబు, వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మోహన్‌సింగ్‌, ఏరియా సర్వే అధికారి రవి, పర్యావరణ అధికారి శ్రీనివాస్‌, అధికారులు వెంకట్రావు, లింగబాబు, మదార్‌సాహెబ్‌, కాపా శివాజీ, హరికృష్ణమాచార్యులు తదితరులున్నారు.