సోమవారం 26 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 24, 2020 , 01:22:59

‘డబుల్‌' ఇళ్లకు స్థలం కేటాయించండి

‘డబుల్‌' ఇళ్లకు స్థలం కేటాయించండి

  • సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే సండ్ర వినతి
  • ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే
  • సమస్యల  పరిష్కారానికి హామీ ఇచ్చినకేసీఆర్‌

సత్తుపల్లి : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని టింబర్‌డిపో ఆధీనంలో నిరుపయోగంగా ఉన్న 30 ఎకరాల భూమిని, ద్వారకాపురి, జోహర్‌నగర్‌, గాంధీనగర్‌ మధ్యలో ఉన్న 18 ఎకరాల ఫారెస్ట్‌ భూమిని నిరుపేదల కోసం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన సత్తుపల్లి మున్సిపాలిటీలోని ఎన్‌టీఆర్‌ నగర్‌, వెంగళరావ్‌నగర్‌లో బాంబ్‌ బ్లాస్టింగ్‌లు జరుగుతున్నాయని, దీంతో ఆ ప్రాంతాల్లోని గృహాలు పెచ్చులు ఊడి శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. అక్కడి ప్రజల కోసం 1100 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు.

అదేవిధంగా బస్టాండ్‌ ఏరియా అటవీశాఖ ఆధ్వర్యంలోగల స్థలంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని నిర్మించడానికి 230 గజాల స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ త్వరలో పూర్తవుతున్న తరుణంలో సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ప్రధాన కాల్వ ద్వారా ఏన్కూరు నుంచి నాగార్జున బ్రాంచి కాల్వకు కలపడం వల్ల లక్ష ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. ఈ కాల్వ నిర్మాణానికి సుమారు రూ.90 కోట్ల అంచనా వ్యయం అవుతుందని, భూ సేకరణ చేసి ఆ కాల్వ నిర్మాణ పనులు కూడా చేపట్టాలని కోరారు.

మున్సిపాలిటీ పరిధిలో అనువంశికంగా వచ్చిన పట్టా భూముల్లో నిర్మాణం చేసుకున్న ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలాల విషయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలను పునఃపరిశీలించాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనికి సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ.. మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్‌నగర్‌లో నివసిస్తున్న వారికి పొజీషన్‌ కల్పిస్తామని, విరాఠ్‌నగర్‌, అంబేద్కర్‌నగర్‌, రాజీవ్‌నగర్లలోని అసైన్డు భూముల్లో పేరు మార్పిడి జరగని వారికి, వారసులు, తాతల నుంచి సంక్రమించిన వారి భూమికి పొజిషనల్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 


logo