సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 24, 2020 , 00:29:59

తల్లీబిడ్డలకు ‘ఆరోగ్యలక్ష్మి’

తల్లీబిడ్డలకు ‘ఆరోగ్యలక్ష్మి’

  • మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు
  • మణుగూరు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు

మణుగూరు: మాతా శిశు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం అమలు చేస్తోందని, తల్లీబిడ్డలకు ఆరోగ్యలక్ష్మి వరమని జడ్పీటీసీ పోశం నర్సింహారావు అన్నారు. ఆయన బుధవారం మణుగూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బండారిగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య కరమైన సమాజమే ప్రభుత్వ ధ్యేయమని, ఆరోగ్య కరమైన సమాజాన్ని తీర్చిదిద్దడంలో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర కీలకమైందన్నారు. తొలుత ఐసీడీఏస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు.

అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి వరలక్ష్మి, పోషణ్‌ అభియాన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కల్పన, జిల్లా అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ బాలు, మణుగూరు ఐసీడీఎస్‌ పీవో జయలక్ష్మి, ఈవో హసీన తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం

మణుగూరు: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి అన్నారు. బుధవారం మణుగూరు మండలంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను టీఆర్‌ఎస్‌ పార్టీ మండల, పట్టణ నాయకులతో కలిసి వారు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..

మండలంతో పాటు మున్సిపాలిటీలో 13 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 4 లక్షల విలువగల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మణుగూరు పీఏసీఎస్‌ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ముత్యంబాబు, అడపా అప్పారావు, ఆవుల నర్సింహారావు, ముద్దంగుల కృష్ణ, రుద్ర వెంకట్‌, కూనవరం  సర్పంచ్‌ ఏనిక ప్రసాద్‌, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, వేముల లక్ష్మయ్య, ఆర్‌.వెంకటరెడ్డి, సృజన్‌, రవి, ఎడవల్లి వెంకటయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.