శుక్రవారం 30 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 22, 2020 , 00:09:41

ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్‌ఎస్‌దే

ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్‌ఎస్‌దే

ఎర్రుపాలెం : రాష్ట్రంలో ఏ ఎన్నికల్లోనైనా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులదే విజయమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు అన్నారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం ఎస్‌జేకేఎం కళాశాలలో టీఆర్‌ఎస్‌ మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సమావేశంలో జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొండబాల మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించేందుకు మండలస్థాయి, గ్రామస్థాయి నాయకులు బాధ్యతగా పనిచేయాలన్నారు. ఆన్‌లైన్‌లో లేదా, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఓట్లు నమోదు చేయించుకోవచ్చని తెలిపారు. అనంతరం జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ అధినాయకత్వం అప్పగించిన బాధ్యతను సక్రమంగా పూర్తిచేయాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన మండల కమిటీ కోఆర్డినేటర్‌ దేవరకొండ చిరంజీవి ఆధ్వర్యంలో గ్రామస్థాయి కోఆర్డినేటర్లందరూ తమతమ గ్రామాల్లో ఉన్న 2017 కంటే ముందు డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులను పూర్తిచేసి వారి యొక్క ఓట్లను నమోదు చేయించేందుకు కృషిచేయాలన్నారు. గతంలో ఓటుహక్కు ఉన్న వారిని గుర్తించి వారి ఓట్లను మళ్లీ చేర్పించాలన్నారు. ఈ సమావేశంలో మాజీఏఎంసీ చైర్మన్‌ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, దేవరకొండ చిరంజీవి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ శీలం వెంకట్రామిరెడ్డి, జిల్లా సభ్యురాలు వేమిరెడ్డి త్రివేణి, టీఆర్‌ఎస్‌ మండల మహిళా అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మొగిలి అప్పారావు, పలుగ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

అభివృద్ధి పనుల పరిశీలన

ఎర్రుపాలెంలో ఏర్పాటు చేసిన నూతన టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని కొండబాల కోటేశ్వరరావు, లింగాల కమల్‌రాజు ప్రారంభించారు. అనంతరం పలుగ్రామాలకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న రైతువేదికను పరిశీలించారు. 

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా 

మధిరరూరల్‌ : తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్‌ పాలన కొనసాగుతుందని జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో సోమవారం మధిర పెద్దచెరువులో జడ్పీచైర్మన్‌ చేపపిల్లలను విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని చెరువులో చేపపిల్లలను విడుదల చేసే బాధ్యతను ఆ గ్రామసర్పంచ్‌లకు, ప్రజాప్రతినిధులకు ఇవ్వడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌దుకాణాల్లో సన్నబియ్యం అందించే దిశగా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అన్నపూర్ణగా పిలవబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత, మధిర మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొండితోక లత, వైస్‌చైర్మన్‌ శీలం విద్యాలత, ఆత్మకమిటీ చైర్మన్‌ రంగిశెట్టి కోటేశ్వరరావు, చేపల సొసైటీ సభ్యులు సుబ్బారావు, ఎఫ్‌డీవో శివప్రసాద్‌, ఫీల్డ్‌ఆఫీసర్‌ బెనర్జీ, మురళీ, తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం 

మధిర : మండల పరిధిలోని చిలుకూరు ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తూ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన వూట్ల రాధాకృష్ణను సోమవారం ఆయన నివాసంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు అభినందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంతో ఎంఈవో వై.ప్రభాకర్‌, శీలం వెంకటరెడ్డి, ఆర్‌.రంగారావు, కే.జయరాజు, ఆర్‌.బ్రహ్మారెడ్డి, కొమ్ము శ్రీనివాసరావు, నరసింహారావు, ప్రసాదరావు, సత్యనారాయణరెడ్డి, రఫీ, కిరణ్‌కుమార్‌, జమీర్‌, అప్పారావు, రాజు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.