సోమవారం 26 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 21, 2020 , 02:48:47

కొత్త రెవెన్యూ చట్టంతో ప్రతి రైతుకు మేలు

 కొత్త రెవెన్యూ చట్టంతో ప్రతి రైతుకు మేలు

  • రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరు: ప్రతి రైతుకు కొత్త రెవెన్యూ చట్టంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును  రైతుబంధు సమితి మండల నాయకులు, మండల పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా  ప్రభుత్వ విప్‌ రేగా మాట్లాడుతూ అసెంబ్లీలో  బిల్లు ప్రవేశ పెట్టడంతోనే సరత్రా హర్షం వ్యక్తమైందన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలో నవశకం ప్రారంభమైందన్నారు.రైతుకు దన్నుగా కేసీఆర్‌  ప్రభుత్వం  రెవెన్యూ  రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిందని సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు,  రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు దొబ్బల వెంకటప్పయ్య, పీఏసీఎస్‌ ఉపాధ్యక్షులు దొండేటి రాంమ్మోన్‌రావు. మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు, వర్కింగ్‌ ప్రెపిడెంట్‌ బొలిశెట్టి నవీన్‌,  కత్తి రాము, ఆర్‌. వెంకటరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరు 

పినపాక: రాష్ట్రంలో ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరును అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన ఆదివారం మండలంలో గడ్డంపల్లి గ్రామంలో మిషన్‌భగీరథ పథకంలో రూ. 13లక్షల నిధులతో మంజూరైన వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమిపూజ చేసి మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ఎన్నో తిప్పలు పడ్డామని అయితే తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్రాగునీటి కష్టాలను తొలగించేందుకు మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి స్వచ్చమైన గోదావరి జలాలను ఇంటింటికీ నల్లాల ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో త్రాగునీటి సరఫరా బ్రహ్మాండంగా జరుగుతుందని మరి కొద్దిరోజుల్లోనే మిగతా గ్రామాలన్నింటిలో వాటర్‌ ట్యాంకు నిర్మాణాలను చేపట్టి ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్‌ ఎంపీపీ కె సుబ్బారెడ్డి, గడ్డంపల్లి సర్పంచ్‌ కలివేటి సునీల్‌, టీఆర్‌ఎస్‌  అధ్యక్షుడు పగడాల సతీష్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వీయస్‌ఆర్‌ఎస్‌ వర్మ, వైస్‌ చైర్మన్‌ బి వెంకటరెడ్డి, వాసుబాబు, లక్ష్మారెడ్డి, పుల్లెపు శ్రీనివాస్‌రావు, బొలిశెట్టి నర్సింహారావు, బూర సురేష్‌, ఏఈ విజయకృష్ణ పాల్గొన్నారు.

 ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్య సమాజం

కరకగూడెం: ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్య సమాజం సాధ్యమని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం కరకగూడెం మండల పర్యటనలో భాగంగా స్వగ్రామం కుర్నవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం ఆవు మూత్రం, జీవామృతంతో సాగుచేసిన వరి పంటను పరిశీలించారు. కేవలం నాటు ఖర్చు తప్ప ఎటువంటి ఖర్చు తావులేకుండా ఈ పంటను సాగుచేస్తున్నట్లు ఆయన వివరించారు. సంపూర్ణ ఆరోగ్యానికి అతి తక్కువ ఖర్చుతో సాగు చేసే ఈ పంటలపై రైతులు ఆసక్తి కనబర్చాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.కాగా . రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మోతే గ్రామానికి చెందిన యువకుడు అక్కిరెడ్డి సతీష్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు సయ్యద్‌ మహిబూబా హుస్సేన్‌ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న ఆయన పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం కల్పించారు. 

కాంగ్రెస్‌ నుండి 60 కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరిక

అశ్వాపురం: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెడ్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి అన్ని వర్గాలు ఆకర్షితులవుతున్నారని  ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మండలలోని వివిధ గ్రామాలకు చెందిన 60 కుటుంబాలు   కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ మైదాన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు రెగ్యులైజ్‌ చేసుకునేందుకు 58, 59 జీఓకు మరోసారి అవకాశం కల్పిస్తున్నారన్నారు.

ఎమ్మెల్యేగా గిరిజనులు, గిరిజనేతరులకు న్యాయం చేసే దిశగా తాను ప్రయత్నం చేస్తున్నానని. చట్టాలను తొలిగించేందుకు తాను మద్దతు తెలుపుతున్నట్లు కొందరు ఓర్వలేక చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోకపోతే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.. పార్టీలో చేరిన వారిలో కోరెం రామారావు, సోయం శ్రీనివాస్‌, వార్డు సభ్యులు కోరెం స్వప్న, కణితి సుహాసిని, బొల్లి సునీత, గొగ్గల అశోక్‌, జిగట సుజాత తోపాటుగా 60 కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

కాగా వివిధ కారణాలతో అకాల మరణం చెందిన కుటుంబాలను రేగా పరామర్శించడంతోపాటు చెక్కులను అందజేశారు. జగ్గారం గ్రామంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలైన కిన్నెర సాయికుమార్‌, కంసాని సుధ, ఎలకలగూడెం గ్రామానికి చెందిన తాటి సరసింహారావు అకాల మృతిచెందడంతో వారి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు.

మొండికుంట గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు కొల్లు మోహన్‌రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా శ్మశాన వాటిక వద్దకు వెళ్ళి మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ తూళ్ళూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, జెడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, వైస్‌ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల అధ్యక్షుడు కోడి అమరేందర్‌, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు షరీఫుద్దీన్‌, సర్పంచ్‌  శారద , వెన్న అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. .logo