బుధవారం 28 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 21, 2020 , 01:15:20

నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

  • హాజరుకానున్న మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్‌ రేగా 

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: భద్రాచలంలోని కేకే ఫంక్షన్‌హాల్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ఖమ్మం, వరంగల్‌, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగనుంది. సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు ముఖ్యఅతిథులుగా హాజరవుతారు. జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, పార్టీ జిల్లా ఇన్‌చార్జి నూకల నరేశ్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తెల్లం వెంకట్రావ్‌ తదితరులు పాల్గొననున్నారు.

సమావేశానికి నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు హాజరుకావాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తెల్లం వెంకట్రావ్‌ విజ్ఞప్తి చేశారు.మంత్రి అజయ్‌కుమార్‌ ఉదయం 8:30 గంటలకు ఖమ్మంలోని తన స్వగృహం నుంచి బయలుదేరి 10:30 గంటలకు సమావేశంలో పాల్గొంటారని, తిరిగి 1:00 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి 2:30 గంటలకు ఖమ్మం చేరుకుంటారన్నారు. logo