శనివారం 31 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 20, 2020 , 02:37:36

పోలీసులను హతమార్చేందుకే మందుపాతరాలు

పోలీసులను  హతమార్చేందుకే  మందుపాతరాలు

కొత్తగూడెం: తేగడ - కలివేరు గ్రామాల మధ్యన భధ్రాచలం - చర్ల రహదారి పక్కన  మావోయిస్టులు పోలీసులను చంపాలనే ఉద్దేశంతో మందు పాతరలు  అమర్చినట్లు భధ్రాచలం ఏఎస్పీ శబరీశ్‌ తెలిపారు. ఆ ప్రదేశంలో రెండు కర్రలు పాతి ఎర్రటి రంగు బేనర్‌ కట్టి అక్కడ కొన్ని వాల్‌పోస్టర్స్‌, కరపత్రాలు పెట్టారని, విశ్వసనీయ సమాచారం మేరకు చర్ల ఎస్సై తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారని చెప్పారు.

ఈ సమాచారం మేరకు బాంబ్‌ డిస్పోజల్‌ స్కాడ్‌ సహాయంతో పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి శక్తివంతమైన మందు పాత్రలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారన్నారు. ఈ విషయంలో చర్ల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైందని, దీనికి బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.