ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 20, 2020 , 02:37:39

ఇసుక ర్యాంపులసై అడిషనల్‌ కలెక్టర్‌ సీరియస్‌

ఇసుక ర్యాంపులసై అడిషనల్‌ కలెక్టర్‌ సీరియస్‌

మణుగూరు రూరల్‌: సాంబాయిగూడెం ఇసుకర్యాంపు నిర్వహణలో సొసైటీ సభ్యులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తీరుపై అడిషనల్‌ కలెక్టర్‌ అనుదీప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మణుగూరు మండలంలోని సాంబాయిగూడెంలో నిర్వహిస్తున్న ఇసుకర్యాంపును ఆకస్మికంగా సందర్శించి ఆయన పలు రికార్డులను పరిశీలించారు. సొసైటీ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వారిని అక్కడికి పిలిపించి ర్యాంపుకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొసైటీ సభ్యులు కాకుండా ఇతరులు ఎవరైనా ఇసుక తరలింపులో జోక్యం చేసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. గత మూడునెలలకు సంబంధించిన ఇసుక ట్రాక్టర్ల ట్రిప్పుల రిజిస్ట్రర్‌ని పరిశీలించి రికార్డులు, సొసైటీ సభ్యులు రీచ్‌ల వద్ద ఉంచకుండా ఇంట్లో ఉంచుకోవడంపై, ఇసుక ట్రిప్పులకు సంబంధించిన రశీదులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం  భూ రికార్డులను పరిశీలించారు.