బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 20, 2020 , 02:37:39

బాంబేకాలనీలో చోరీ

బాంబేకాలనీలో చోరీ

మణుగూరురూరల్‌: మణుగూరు మండల పరిధిలోని సింగరేణి కార్మికులు నివసించే క్వార్టర్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, స్థానికులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం..బాంబేకాలనీలోని ఎంసీ-9, ఎంసీ-10 క్వార్టర్లలో రామకృష్ణ, యలమంద నివాసం ఉంటున్నారు.  రామకృష్ణ, యలమందల ఇంట్లో ఎవరూలేని సమయంలో శుక్రవారం రాత్రి దొంగలు తాళాలు పగులగొట్టి బీరువాలోని దుస్తులు చిందరవందరగా పడేసి రూ.6వేల నగదు, 8 తులాలు పట్టీలు దొంగిలించినట్లు గుర్తించామన్నారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా, తమకు ఎటువంటి సమాచారం అందలేదన్నారు.