గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 20, 2020 , 02:32:24

జీవరాశులకు పునర్జీవం

జీవరాశులకు పునర్జీవం

  • తొణికిసలాడుతున్న జీవ వైవిధ్యం

మణుగూరు:రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, మిషన్‌కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం వంటి ఎన్నో కార్యక్రమాలు జీవవైవిధ్య పరిరక్షణకు దోహదపడ్డాయి. అడవుల్లో జంతువులు, చెరువుల్లో కొత్త రకం చేపలు సాక్షాత్కరిస్తున్నాయి...


జింక పిల్లల గంతులు వేస్తున్నాయి. అదృశ్యమైన పక్షలు, జంతువులు కన్పిస్తూ కనువిందు చేస్తున్నాయి.  పినపాక నియోజకవర్గంలో జీవ వైవిధ్యం వెల్లివిరుస్తోంది.  వివిధ జాతుల వన్యప్రాణులు, క్రిమీకీటకాలు, పక్షులు తమ సంతతిని  వృద్ధిచేసుకుంటున్నాయి.  జింకలు, నక్కలు, అడవి కుక్కలు, కొండ గొర్రెలు,  అడవి బర్లు, దున్నలు, కొండ చిలువలు, నాగు పాములు , తేళ్లు, ఎలుగు బంట్లు, చిరుతపులి, ముళ్ల పందులు, అడవి కోళ్లు, అడవి పందులు, కుందేళ్లు, ఉడుములు  దర్శనమిస్తున్నాయి.