శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 20, 2020 , 02:37:53

నేరస్తులకు శిక్ష పడాలి

నేరస్తులకు శిక్ష పడాలి

కొత్తగూడెం క్రైం: బాధితులకు న్యాయం చేయడం విషయంలో ‘క్వాలిటీ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌'తో ముందడుగు వేయాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌ దత్‌ అన్నారు. మణుగూరు సర్కిల్‌, కొత్తగూడెం వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులతో శనివారం తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది బాధ్యతగా పని చేయాలన్నారు.

‘క్వాలిటీ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌'తో నేరస్తులకు శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేసేలా పనిచేయాలని సూచించారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, మణుగూరు సర్కిల్‌ పరిధిలో ఉన్న పెండింగ్‌ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌'లో భాగంగా ప్రజలతో మమేకమై వారిలో మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. ఈ సమావేశంలో మణుగూరు ఏఎస్పీ శబరీశ్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ చల్లగుండ్ల శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ గురుస్వామి, మణుగూరు సీఐ ఎంఏ షుకూర్‌, కొత్తగూడెం వన్‌ టౌన్‌ ఇన్‌స్పెపెక్టర్‌ లావుడియా రాజు, పోలీస్‌ పీఆర్‌వో దాములూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.