గురువారం 29 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 19, 2020 , 00:44:38

పేదలకు కొండంత అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు

 పేదలకు కొండంత అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు

కొత్తగూడెం:   పేదలకు కొండంత అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు నిలుస్తున్నాయని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం టౌన్‌, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌ మండలాలకు చెందిన 105 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ.కోటి విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌  చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణలోని నిరుపేద యువతుల వివాహ ఖర్చుల కోసం నగదు అందించి  పెద్దన్నలా నిలుస్తున్నారన్నారు.

అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ పథకాలు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేందర్‌రావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్‌ మండె వీరహన్మంతరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు బాదావత్‌ శాంతి, భూక్యా విజయలక్ష్మి, భూక్యా సోనా, జెడ్పీటీసీ బిందుచౌహాన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వేల్పుల దామోదర్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కో ఆప్షన్‌ మెంబర్లు వార్డు మెంబర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మండలాల తహసీల్దార్లు  రవికుమార్‌, నాగరాజు, భధ్రకాళీ, అధికారులు పాల్గొన్నారు. logo