సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 19, 2020 , 00:40:54

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కరకగూడెం: ములుగు జిల్లా రంగాపురం-తాడ్వాయి మార్గమధ్యలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరకగూడెం మండలం మోతే గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందాడు. ఆ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు...

మండలంలోని మోతే గ్రామానికి చెందిన అక్కిరెడ్డి సతీష్‌ రెడ్డి(30) కొంతకాలంగా హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ సీఏ చదువుతున్నాడు. కరోనా  లాక్‌డౌన్‌తో మార్చిలో స్వగ్రామానికి వచ్చి, అక్కడే చికెన్‌ షాపు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్‌లో గతంలో తాను పనిచేసిన కంపెనీలో తిరిగి ఉద్యోగం కోసం శుక్రవారం మోతే నుంచి హైదరాబాద్‌కు ములుగు జిల్లా రంగాపురం-తాడ్వాయి ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మార్గమధ్యలోగల కామారం గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన టాటా ఏస్‌ వాహనం ఢీకొంది. సతీష్‌రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, 108 సిబ్బంది కలిసి వరంగల్‌లోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడు అక్కడే మృతిచెందాడు. సతీష్‌రెడ్డి చిన్నతనంలోనే అతడి తండ్రి గతించారు. ఇతడికి తల్లి మల్లికాంబ, భార్య రాణి, రెండేడ్ల పాప యోగితారెడ్డి ఉన్నారు.