సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 19, 2020 , 00:23:29

రూ.14.30 లక్షలకు ఐపీ

రూ.14.30 లక్షలకు ఐపీ

కొత్తగూడెం లీగల్‌: పాల్వంచ పట్టణానికి చెందిన చింతకాయల వినోద్‌కుమార్‌ రూ.14.30 లక్షలకు కొత్తగూడెం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో దివాళా పిటిషన్‌(ఐపీ) దాఖలు చేశాడు. పిటిషన్‌లోని వివరాలు... చింతపాల్వంచలోని కపిల్‌ చిట్‌ఫండ్‌ కంపెనీలో మేనేజర్‌గా వినోద్‌కుమార్‌ పనిచేస్తున్నారు.

తనకు ఇచ్చిన టార్గెట్‌ను చేరుకునేందుకు స్నేహితులతో చిట్టీలు వేయించాడు. వారిలో కొందరు వాయిదాలు చెల్లించకపోవడంతో తానే అప్పులు తెచ్చి చెల్లించాడు. వీటిపై వడ్డీలు పెరగడంతో చెల్లించలేకపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మొత్తం 15 మందిరి ప్రతివాదులుగా పేర్కొంటూ దివాళా పిటిషన్‌ దాఖలు చేశాడు. ఆయన తరఫున న్యాయవాదులుగా దంతాల ఆనంద్‌, జె.గోపీకృష్ణ, మెండు రాజమల్లు వ్యవహరిస్తున్నారు.