శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 15, 2020 , 00:32:15

ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించండి

ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించండి

మణుగూరురూరల్‌: ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని మలేరియా ప్రొగ్రాం ఆఫీసర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో మోకాళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మణుగూరు వచ్చిన ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అటెండెన్స్‌ రిజిస్టర్‌, మూమెంట్‌ రిజిస్టర్‌, మలేరియా రిజిస్టర్‌ డెలివరీ, ల్యాబ్‌ రిజిస్టర్లను పరిశీలించి మలేరియా కేసుల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల పట్ల తీసుకుంటున్న చర్యలను, హోం ఐసొలేషన్‌, కంటైన్మెంట్‌ సర్వే, ప్రైమరీ కాంటాక్ట్‌ లిస్ట్‌ను వైద్యురాలు మౌనికను అడిగి తెలుసుకున్నారు. సీహెచ్‌వో కృష్ణయ్య, వెంకటేశ్వరరావు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

కరోనా బాధిత కుటుంబానికి నిత్యావసరాల అందజేత

కరకగూడెం: మండలంలోని గొల్లగూడెం గ్రామంలో కరోనా భారీన పడిన కుటుంబానికి ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచన మేరకు సోమవారం టీఆర్‌ఎస్వీ పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు గుడ్ల రంజిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో మందులు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఆందోళన చెందకుండా వైద్యులు సూచించిన సలహాలు, సూచనలు పాటిస్తూ సకాలంలో మందులు వేసుకుని పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ చేను సాంబయ్య, పంచాయతీ సిబ్బంది సంజీవ్‌ కుమార్‌ పాల్గొన్నారు.