సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 14, 2020 , 22:33:07

మిషన్‌ భగీరథ పనులకు భూమిపూజ

మిషన్‌ భగీరథ పనులకు భూమిపూజ

పినపాక: మండలంలోని ఏడూళ్ళబయ్యారంలో మిష న్‌ భగీరథ పైపులైన్‌ నిర్మాణ పనులకు ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆదివారం భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే సదుద్దేశంతో మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ప్రజలు పైపులైన్ల నిర్మాణాలకు సహకరించి తాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ కోరెం రజిని, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పగడాల సతీశ్‌రెడ్డి, మిషన్‌ భగీరథ ఏఈ విజయకృష్ణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బత్తుల వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉడుముల లక్ష్మీరెడ్డి, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, ముల్లంగి వెంకటరెడ్డి, యాంపాటి సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.