గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 11, 2020 , 00:29:40

ఇద్దరు బడుగు జీవులపై పిడుగులు

ఇద్దరు బడుగు జీవులపై పిడుగులు

ఇద్దరు బడుగు జీవులపై పిడుగులు పడ్డాయి. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఇల్లెందు మండలంలోని సుంకరగూడెం వద్ద చెట్టుపై పిడుగు పడడంతో వ్యవసాయ కూలీ మృతిచెందాడు. కరకగూడెం మండలం చొప్పాల పంచాయతీ నర్సాపురం గ్రామంలో పత్తి చేనులో పిడుగు పడడంతో యువ రైతు మృతిచెందాడు.


ఇల్లెందు రూరల్‌: మండలంలోని మామిడిగూడెం పంచాయతీ సుంకరగూడెం గ్రామ శివారులోని పొ లంలో గురువారం పిడుగు పడింది. అక్కడే ఉన్న వ్యవసాయ కూలీ మృతిచెందాడు. మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక రైతులు, క్షతగాత్రులు తెలిపిన వివరాలు... మాణిక్యారం పంచాయతీ బీల్యాతండా గ్రా మస్తుడు గుగులోత్‌ వెంకన్న, తనకున్న ఎకరం పొలంలో గురువారం మిర్చి నాట్లు వేసేందుకు  సమీప గ్రామాల్లో ని తన బంధువులను కూలి పనికి పిలిపించాడు.

అం ద రూ కలిసి మధ్యాహ్నం వరకు పనులు చేసి భోజనానికి సిద్ధమయ్యారు. అంతలోనే ఒక్కసారిగా వర్షం మొదలవడంతో ఓ చెట్టు నీడకు చేరుకున్నారు. కొద్దిసేపటికే పె ద్ద శబ్దంతో ఆ చెట్టుపై పిడుగు పడింది. పని కోసం వచ్చిన గుగులోత్‌ రాందాస్‌(42) అక్కడిక్కడే మృతిచెందాడు. అతడి భార్య చిట్టి, కుమార్తె సుప్రియ, బంధువులు వెం కన్న, డ్వాలి, చంటి, రవి, బుల్లి, సరస్వతి, లచ్చి, వెంక, కమిలి, డ్వాని స్వల్పంగా గాయపడ్డారు. పిడుగుపాడుతో వారంతా స్పృహ కోల్పోయారు.

సమీపంలోని రై తులు పరుగున వచ్చి, వారిని  మాణిక్యారం పంచాయతీలోని బీల్యాతండాకు చేర్చారు. వారు స్పృహలోకి రాకపోవడంతో అక్కడి నుంచి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఒక్కొక్కరుగా స్పృ హ లోకి వచ్చారు. మృతిచెందిన రాందాస్‌కు ఇద్దరు భార్య లు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాద స్థలాన్ని త హ సీల్దార్‌ మస్తాన్‌రావు పరిశీలించారు. రాందాస్‌ కు టుం బీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

కరకగూడెం మండలంలో గిరిజన రైతు..

కరకగూడెం: మండలంలోని చొప్పాల పంచాయతీ నర్సాపురం గ్రామంలో గురువారం పిడుగుపాటుకు యువ రైతు మృతిచెందాడు. అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. నర్సాపురం గ్రామస్తుడైన తోలెం ఆదినారాయణ(33) తనకున్న కొద్ది చెలకలో పత్తి సాగు చేశాడు. దానికి గురువారం మధ్యాహ్నం పురుగు మందు చల్లుతుండగా వర్షం మొదలైంది. ఆ వెంటనే పిడుగు పడింది. ఆదినారాయణ అక్కడికక్కడే కుప్పకూలాడు. సమీప పొలాల్లోని రైతులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు వచ్చేసరికి మృతిచెందాడు. ఆయనకు భార్య రాధ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  ఆయన భార్య రోదన... చూపరులకు కంట తడి పెట్టించింది.