బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 04, 2020 , 01:08:05

ఇంటింటికీ నల్లానీరు

ఇంటింటికీ నల్లానీరు

  • జడ్పీటీసీ పోశం నర్సింహారావు

మణుగూరు రూరల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు వచ్చేలా సీఎం కేసీఆర్‌ కృషి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని జడ్పీటీసీ పోశం నర్సింహారావు అన్నారు. గురువారం ఎంపీపీ కారం విజయకుమారి, సర్పంచ్‌ బచ్చల భారతితో కలిసి సమితి సింగారం పరిధిలోని వెంకటపతినగర్‌లో మిషన్‌ భగీరథ పనులను ప్రారంభించారు.  ఉపసర్పంచ్‌ పుచ్చకాయల శంకర్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ కుర్రి నాగేశ్వరరావు, ఎంపీవో వెంకటేశ్వరరావు, వార్డు మెంబర్లు నాగరాజు, రామిడి గ్రామస్తులు పాల్గొన్నారు.

రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

 విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి రక్షణ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కొండాపురం భూగర్భ గని యాక్టింగ్‌ మేనేజర్‌ ఆర్‌ మధుబాబు అన్నారు. గురువారం మైన్‌ ఆవరణలో రక్షణలో కార్మికులు తీసుకోవాల్సిన విషయాలపై అవగాహన కల్పించారు. గ్రూప్‌ ఇంజినీర్‌ సాయినాథ్‌, ఫిట్‌ ఇంజినీర్‌ గోపి, అండర్‌ మేనేజర్లు శ్రీకాంత్‌, భరత్‌, నరేశ్‌, వర్క్‌మెన్‌ ఇన్‌స్పెక్టర్లు దాట్ల లక్ష్మణ్‌, ఫిట్‌ సెక్రటరీ నాగెళ్లి వెంకన్న పాల్గొన్నారు.