సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 01, 2020 , 03:06:48

చెప్పుల వ్యాపారి ఐపీ

చెప్పుల వ్యాపారి ఐపీ

ఖమ్మం లీగల్‌: ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన చెప్పుల వ్యాపారి జంగిలి రంజిత్‌ కుమార్‌ సోమవారం ఖమ్మం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో రూ.39.50లక్షలకు దివాళ పిటిషన్‌(ఐపీ) దాఖలు చేశాడు. పిటిషన్‌లోని వివరాలు... పిటిషనర్‌ రంజిత్‌కుమార్‌ మొదట హన్మకొండలో మెడికల్‌ షాప్‌ నడిపాడు. అందులో నష్టాలు రావడంతో తన కుటుంబాన్ని ఖమ్మం ప్రకాశ్‌నగర్‌కు మార్చి, అక్కడే ‘జేఆర్‌ ఫుట్‌వేర్‌' పేరుతో చెప్పుల షాపు ప్రారంభించాడు.

అన్ని మోడల్స్‌ చెప్పులను హైదరాబాద్‌ నుంచి తెప్పించి అమ్మేవాడు. ఈ వ్యాపార అభివృద్ధి కోసం బంధువులు, స్నేహితుల దగ్గర అధిక వడ్డీలకు అప్పు తెచ్చాడు. ఈ షాపులోని చెప్పులను చుట్టు పక్కల వారికి అప్పుగా అమ్మాడు. వారు సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో వ్యాపారం లో నష్టాలొచ్చాయి. రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో మొత్తం 22 మందిని ప్రతివాదులుగా చూపిస్తూ దివాళ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఆయన తరఫున న్యాయవాదులుగా జమ్ముల శరత్‌కుమార్‌ రెడ్డి, గరిక సంపత్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు.