మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 01, 2020 , 03:06:52

ఉద్యమకారుల కుటుంబాలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

ఉద్యమకారుల కుటుంబాలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

కరకగూడెం: తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించి వారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సరైన సమయంలో పదవులు కట్టబెట్టి గౌరవిస్తుందని టీఆర్‌ఎస్వీ పినపాక నియోజకవర్గ గుడ్ల రంజిత్‌ కుమార్‌ అన్నారు.

ఈ మేరకు ఆయన మండలంలోని గొల్లగూడెం గ్రామంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు.నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం ముసలిమడుగు పంచాయతీ పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధే ధ్యేయంగా గత 20 ఏండ్లుగా పార్టీనే నమ్ముకుని ఎటువంటి విమర్శలకు తావులేకుండా పనిచేస్తున్న పొడియం నరేందర్‌ను ప్రభుత్వవిప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గుర్తించి ఆయన సతీమణి ముత్యాలమ్మకు బూర్గంపాడు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టడం అరుదైన గౌరవంఅని ఆయన తెలిపారు.

అలాగే మరోవైపు మండలానికి చెందిన కొమరం రాంబాబుకు వైస్‌చైర్మన్‌ పదవి కట్టబెట్టడం హర్షణీయమన్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో పార్టీలో పనిచేస్తూ ముందుకు సాగే వారికి వాటంతటవే పదవులు వరిస్తాయని మరోసారి రుజువైందని గుర్తుచేశారు. అనంతరం బూర్గంపాడు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన ముత్యాలమ్మకు, ఉద్యమకారుడు పొడియం నరేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విప్‌ రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు