గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 01, 2020 , 03:06:52

ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థులు తప్పక వీక్షించాలి

ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థులు తప్పక వీక్షించాలి

సారపాక:రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమవుతున్న నేపధ్యంలో విద్యార్థులందరూ క్రమం తప్పకుండా టీవీల్లో పాఠాలను వీక్షిస్తూ అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలను నోట్‌ చేసుకోవాలని సారపాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం తోటమళ్ల రమ సోమవారం తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను సమయం ప్రకారం టీవీల్లో వచ్చే ఆన్‌లైన్‌ తరగతులు వీక్షించేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వర్క్‌షీట్లు, పాఠ్యాంశాల్లో ఏవైనా సందేహాలుంటే వాట్సాప్‌ గ్రూపుల ద్వారా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులపై సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు తీసుకోవాల్సిన ప్రణాళికల గురించి వివరించడం జరిగిందన్నారు.