సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 01, 2020 , 05:19:08

ఏరియా ఉత్పత్తి లక్ష్యంపై వర్ష ప్రభావం

ఏరియా ఉత్పత్తి లక్ష్యంపై వర్ష ప్రభావం

  • ఏరియా జీఎం జక్కం రమేశ్‌

మణుగూరు రూరల్‌: సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలో బొగ్గు వెలికితీతలో కురిసిన వర్షాలు, కరోనా ప్రభావంతో 42శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని ఏరియా జీఎం జక్కం రమేశ్‌ తెలిపారు. సోమవారం జీఎం కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆగస్టు నెల ఏరియాలో 2179 మి.మీ వర్షపాతం నమోదుకావడంతో 7,75,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 4,50,421 టన్నులు వెలికితీశామని, ఓబీ 38శాతం వెలికి తీసినట్లు తెలిపారు.

ముందస్తు ప్రణాళికలతో వార్షిక లక్ష్య సాధనకు సమిష్టి కృషితో ముందుకు వెళ్తామన్నారు. బీహెచ్‌ఈఎల్‌ నిర్మించిన సోలార్‌ ప్లాంట్‌ ద్వారా సింగరేణికి ఏడాదికి దాదాపు 11 కోట్ల ఆదాయం సమకూరనున్నదని తెలిపారు. సోలార్‌ప్లాంట్‌ నుంచి తెలంగాణ జెన్కో గ్రిడ్‌కి విద్యుత్‌ సప్లయ్‌ అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఏరియా ఆస్పత్రిలో సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ ఆదేశాల మేరకు కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు కొవిడ్‌-19 పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఆగస్టు నెలలో 1,225 టెస్టులు నిర్వహించామని తెలిపారు.