బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 31, 2020 , 05:09:12

దిశ కమిటీ సభ్యురాలిగా సిరిపురం స్వప్న

 దిశ కమిటీ సభ్యురాలిగా సిరిపురం స్వప్న

బూర్గంపహాడ్‌:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ సభ్యురాలిగా బూర్గంపహాడ్‌ సర్పంచ్‌ సిరిపురం స్వప్నను నియమించారు. బూర్గంపహాడ్‌కు చెందిన సిరిపురం స్వప్న ఇప్పటికే సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలిగా కూడా కొనసాగుతున్నారు.  దిశ కమిటీ సభ్యురాలిగా నియమితులైన స్వప్న మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించినందుకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. దిశ కమిటీ సభ్యురాలిగా తనను ఎన్నుకునేందుకు సహకరించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం, మమబూబాబాద్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దిశ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన స్వప్నకు మండల తెరాస నాయకులు హర్షం వ్యక్తం చేశారు.