మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 31, 2020 , 02:47:11

నిరుపేద కుటుంబాలకు వరం కల్యాణలక్ష్మి

 నిరుపేద కుటుంబాలకు వరం కల్యాణలక్ష్మి

  • పేదల బాధలు తెలిసిన నేత సీఎం కేసీఆర్‌
  • సంక్షోభంలోనూ సంక్షేమం 
  • చెక్కుల పంపిణీ కార్యక్రమంలోమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

‘కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ సర్కార్‌ సంక్షేమ రాజ్యాన్ని కొనసాగిస్తున్నది.. కల్యాణలక్ష్మి, షాదీ   ముబారక్‌ నిరుపేదలకు వరంలాంటిది..      ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా   కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఈ పథకాన్ని    ప్రవేశపెట్టారు.. నిరుపేదల కష్టాలు తెలిసిన ఏకైక సీఎం ఆయనే..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కొనియాడారు.. ఆదివారం చింతకానిలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు.. 

- చింతకాని

చింతకాని: తెలంగాణ సర్కార్‌ అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం నిరుపేద కుటుంబాలకు వరమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన చింతకాని, మతికేపల్లిలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌ కర్ణన్‌తో కలిసి పాల్గొన్నారు. సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో సంక్షేమం ఆగడం లేదని, నిరుపేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు.

అనంతరం రూ.1.0 కోట్ల విలువైన 110 కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, ఆర్డీవో రవీంద్రనాథ్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చింతకాని ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌ బండి సుభద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆడపిల్లల పెళ్లికి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి సాయం అందిస్తున్నారన్నారు. పల్లె ప్రగతి ద్వారా తెలంగాణ నేరుగా పల్లెలకు నిధులు అందిస్తున్నదని, పల్లెల అభివృద్ధి ముఖచిత్రం మారిపోయిందన్నారు. ఇప్పటివరకు చింతకాని మండలానికి రూ.7 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశామన్నారు. అనంతరం మత్కేపల్లి నామవరం గ్రామంలో సర్పంచ్‌ తిరుపతి కోండలరావు, ఉప సర్పంచ్‌ దేవరగట్ల సునితలతో కలిసి ఆయన వైకుంఠధామానికి శంకుస్థ్ధాపన చేశారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిశోర్‌, ఎంపీపీ పూర్ణయ్య, వైస్‌ ఎంపీపీ గురజాల హనుమంతరావు, సోసైటీ చైర్మన్లు నల్లమోతు శేషగిరి, కోండపల్లి శేఖర్‌రెడ్డి, రైతుబంధు సమితి నాయకులు కిలారు మనోహర్‌, మంకెన రమేశ్‌, మేకనబోయిన రాంబాబు, వంకాయలపాటి వెంకటలచ్చయ్య, కన్నెబోయిన కుటుంబరావు, చల్లా అచ్చయ్య, కిలారు వేణుగోపాల్‌, తిరుపతి కోండలరావు, సుభద్ర, తుడుం రాజేశ్‌, చాట్ల సురేశ్‌, శ్రీనివాసరావు, తిరుపతి రామ్మూర్తి, పఠాన్‌ షబ్బీర్‌ఖాన్‌, పిచ్చయ్య, ఎంపీడీఓ లలితాకుమారి, తహసీల్దార్‌ తిరుమలాచారి, గిర్దావర్లు రఘు, బుల్లిబాబు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.