బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 30, 2020 , 00:48:06

వ్యాధులపై అప్రమత్తం

వ్యాధులపై అప్రమత్తం

వర్షాకాలం సీజన్‌లో వ్యాధులు ప్రబలకుండా జిల్లా వ్యాప్తంగా  చర్యలు చేపడుతున్నారు. ప్రతీ ఇంట్లోసోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన వాటిపై వైద్య సిబ్బంది, అధికారులు ప్రజా ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మణుగూరు రూరల్‌: మండల పరిధిలోని రామానుజవరం పంచాయతీలో సర్పంచ్‌ బాడిశ సతీశ్‌ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ నిర్మూలనకు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ ఈ కార్యక్రమంలో కార్యదర్శి సునీత, ఉపసర్పంచ్‌ ప్రభుదాస్‌, పంచాయతీ సిబ్బంది తదితరులున్నారు. దమ్మక్కపేట పంచాయతీలో సర్పంచ్‌ రాంబాబు ఆధ్వర్యంలో వీధి దీపాలు ఏర్పాటు చేయగా, సాంబాయిగూడెం పంచాయతీలో సర్పంచ్‌ కాయం తిరుపతమ్మ ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి బ్లీచింగ్‌ చల్లించారు. ఆయా కార్యక్రమాల్లో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

పర్ణశాల:మండల పరిధిలోని పర్ణశాల పీహెచ్‌సీ పరిధిలోని సీతానగరం గ్రామంలో శనివారం పీహెచ్‌సీ సిబ్బంది దోమలమందు పిచికారీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంట్లో దోమలు వ్యాప్తిచెందకుండా ఉండేందుకు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యసిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ ఏఎంవో గొంది వెంకటేశ్వరరావు, సబ్‌ యూనిట్‌ హనుమంత్‌, హెచ్‌ఏ నాగేశ్వరరావు, ఏఎన్‌ఎం నర్సమ్మ, ఆశాలు పాల్గొన్నారు.

దుమ్ముగూడెం: మండల పరిధిలోని సింగారం గ్రామపంచాయతీలో సర్పంచ్‌ కొండయ్య పాలకవర్గ సభ్యులతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. సింగారం గ్రామపంచాయతీలో ముందస్తుగా కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి పాలకవర్గంతో చర్చించారు. పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టి సీజనల్‌ వ్యాధులతో పాటు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అవగాహన కల్పించారు.