బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 29, 2020 , 06:20:43

కార్మికులకు అండగా టీబీజీకేఎస్‌

కార్మికులకు అండగా టీబీజీకేఎస్‌

మణుగూరురూరల్‌ : సింగరేణి కార్మికులను కంటికిరెప్పలా కాపాడుకుంటూ.. వారికి ఏ ఆపద వచ్చినా అండగా నిలిచింది ఒక్క టీబీజీకేఎస్‌ మాత్రమేనని టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకర్‌రావు అన్నారు. శుక్రవారం పీవీకాలనీలోని యూనియన్‌ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ -19 బారిన పడిన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులను టీబీజీకేఎస్‌ స్వయంగా కలిసి వారికి  అండగా నిలిచిందన్నారు.