ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 29, 2020 , 06:20:45

శిథిలావస్థకు చేరిన నిర్మాణాల తొలగింపు

శిథిలావస్థకు చేరిన నిర్మాణాల తొలగింపు

మణుగూరు రూరల్‌: మణుగూరులోని పైలట్‌కాలనీలోని శిథిలావస్థకు చేరిన సింగరేణి పాత క్వార్టర్ల గోడలను, అసంపూర్తిగా ఉన్న క్వార్టర్లను సింగరేణి ఏరియా సివిల్‌ ఏజీఎం వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు నవీన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జేసీబీ ద్వారా తొలగించారు. మండల పరిధిలోని కూనవరం పంచాయతీలో సర్పంచ్‌ ఏనిక ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం కార్యాలయాల్లో శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జీపీ కార్యదర్శి వీ.సంధ్యారాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోకేశ్‌, ఉపాధ్యాయులు కె.ఉపేంద్ర, కె.రఘుమోహన్‌రావు, రవిబాబు, జయలక్ష్మి, ఈరు గ్రామస్తులు తదితరులున్నారు.