శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 20, 2020 , 02:50:00

ముంపు వాసులకు అండగా సర్కార్‌

ముంపు వాసులకు అండగా సర్కార్‌

  • సీఎం కేసీఆర్‌ దృష్టికి కరకట్ట సమస్య
  • n మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత
  • n ‘భద్రాద్రి’ అభివృద్ధికి మరిన్ని నిధులు

  • n వరద బాధిత పునరావాస కేంద్రాల పరిశీలన

భద్రాచలం: ముంపు ప్రాంత వాసులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని మానుకోట ఎంపీ మాలోతు కవిత భరోసానిచ్చారు. బుధవారం ఆమె భద్రాచలంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. ఎవరూ అధైర్యపడొద్దన్నారు. కరకట్ట పొడిగింపు విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పట్టణం ముంపునకు గురికాకుండా శాశ్వత పరిష్కారంపై చర్చలు జరుపుతామన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కరకట్ట పూర్తయితే భద్రాద్రి ముంపు నుంచి బయటపడుతుందన్నారు.  కొత్తకాలనీ సందర్శించి మురుగు నీటిని స్లూయిస్‌ల ద్వారా గోదావరిలోకి మళ్లించేందుకు చాలినన్ని మోటార్లు లేవని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకురాగా, మరికొన్ని మోటార్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.  తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా వరద బాధితులను ఆదుకుంటుందన్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆస్తి, పంట నష్టం వివరాలు సేకరించి, వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గ అభివృద్ధ్దికి మరిన్ని నిధులు తీసుకువస్తామన్నారు. అనంతరం రామాలయం పరిసరాల్లోని ముంపునకు గురైన కాంప్లెక్సు ప్రాంతాలను పరిశీలించారు. పట్టణంలో ఏర్పాటుచేసిన పలు పునరావాస కేంద్రాల్లో బాధితులకు భోజనం వడ్డించారు. ఆమె వెంట ఖమ్మం జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, భద్రాచలం ఆర్డీవో స్వర్ణలత, స్పెషల్‌ ఆఫీసర్‌ విజేత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ దుమ్ముగూడెం మండల అధ్యక్షుడు అన్నె సత్యాలు, నాయకులు యశోద నగేష్‌, తిప్పన సిద్దులు, మానె రామకృష్ణ, రాజేంద్ర వర్దన్‌, తాళ్ల రవికుమార్‌, రత్నం రమాకాంత్‌, చాట్ల రవి, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, కోటగిరి ప్రబోద్‌కుమార్‌, రాంబాబు, పడిసిరి శ్రీనివాసు, ప్రేమ్‌కుమార్‌, కొండముక్కల సాయి, వాంకుడోతు నాగేశ్వరరావు, బానోతు రాముడు,  రాము, విజయ్‌, సందీప్‌ ఉన్నారు.