శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 20, 2020 , 01:51:59

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

మణుగూరు రూరల్‌: కొండాపురం సీఎస్‌పీలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుడు మధుసూదన్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్‌ కార్మికులు తమ వంతు సాయంగా రూ.65 వేల నగదును బాధిత కుటుంబ సభ్యులకు కేసీహెచ్‌పీ డీవైఎస్‌ఈ వేణుగోపాల్‌ చేతులమీదుగా అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. 

మాస్కులు, శానిటైజర్ల పంపిణీ

:


సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలో పనిచేస్తున్న కార్మికుడు తన ఔదర్యాన్ని చాటాడు. బుధవారం టీబీజీకేఎస్‌ నేత ఇంతియాజ్‌ పాషా అందజేసిన శానిటైజర్లు, మాస్కులను బ్రాంచి ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావు మణుగూరు ఓసీ కాంట్రాక్ట్‌ కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడుతూ..ఇంతియాజ్‌ పాషా వృద్ధ్దులకు, కాంట్రాక్ట్‌ కార్మికులకు అనేక సందర్భాల్లో సాయం అందించి అండగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ నర్సింహస్వామి, రక్షణాధికారి భాస్కర్‌, గుర్తింపు సంఘం నాయకులు వీరభద్రయ్య, సాగర్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.


పారిశుధ్య కార్యక్రమాలను వేగవంతం చేయాలి

మణుగూరు రూరల్‌: బుధవారం పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. బ్లీచింగ్‌ చల్లడం, చెత్త సేకరణ వంటి కార్యక్రమాలు ప్రతీ రోజు చేపట్టాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ షేక్‌ పెంటూమియా, వార్డు సభ్యులు .తదితరులున్నారు.