బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 18, 2020 , 00:44:52

బదిలీ ఉద్యోగులకు త్వరలో పర్మినెంట్‌

బదిలీ ఉద్యోగులకు త్వరలో పర్మినెంట్‌

మణుగూరు రూరల్‌: బదిలీ వర్కర్లకు సెప్టెంబర్‌1వ తేదీన జనరల్‌ మజ్దూర్లుగా పర్మినెంట్‌ చేస్తూ పదోన్నతి ఉత్తర్వులు అందుతాయని, ఈ మేరకు యాజమాన్యంతో రాష్ట్ర టీబీజీకేఎస్‌ నేతల  చర్చలు పూర్తయ్యాయని  బ్రాంచి నేత ప్రభాకర్‌రావు తెలిపారు. సోమవారం పీవీకాలనీలోని జయశంకర్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.  2400 మంది బదిలీ వర్కర్లను జనరల్‌ మజ్దూర్లుగా పర్మినెంట్‌ చేసేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఇందుకు కృషి చేసిన టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కొత్తగూడెం కార్యాలయంలో టీబీజీకేఎస్‌ రాష్ట్ర నేతలు, సింగరేణి డైరెక్టర్‌(పా) చంద్రశేఖర్‌, జీఎం(ప) ఆనందరావుతో జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2018 నుంచి 2019 వరకు అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తున్న బదిలీ వర్కర్లకు 190 మస్టర్లు, సర్ఫేస్‌ విభాగంలో 240 మస్టర్లు పూర్తిచేసిన ఉద్యోగులందరికీ జనరల్‌ మజ్దూర్లుగా ప్రమోషన్‌ ఇచ్చి పర్మినెంట్‌ చేసేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు.