శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 18, 2020 , 00:36:12

ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు

ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు

  • టీచర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌
  • కార్డు స్వైప్‌ చేస్తేనే హాజరు నమోదు
  • బదిలీలు, పదోన్నతులలోనూ  కీలకపాత్ర

అశ్వారావుపేట: సంస్కరణల్లో భాగంగా విద్యాశాఖ మరో ముందడుగు వేసింది. ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తు న్నదిజ పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యా యులకు సాంకేతికతను జోడిస్తూ గుర్తింపు కార్డులు అందించాలని నిర్ణయించింది. ఇందుకు గాను గత ఏడాది విద్యాశాఖాధికారులు సేకరించిన సమాచా రానికి తోడు మరిన్ని వివరాలు అందించాలని ఇప్ప టికే ఉపాధ్యాయులకు సూచించింది. ఉపాధ్యాయు లు అందించే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువుని చ్చింది. 20190-20లో అందించిన డైస్‌ నమూ నాల్లో పొందుపరిచిన వివరాలతో కూడిన సమాచా రాన్ని పరిగణనలోకి విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులు తీసుకోనున్నారు. ఈ సారి బ్లడ్‌ గ్రూపు, నివా స సమాచారాన్ని కూడా చేర్చారు. ఉపాధ్యాయులు ఇచ్చే సమాచారాన్ని సరిచూసుకుని తేడాలు ఉంటే ఈ నెలాఖరులోగా www.schooledu.telanga na.gov.in సైట్‌ ద్వారా సమర్పించాలని విద్యాశా ఖ డీఈవోల ద్వారా ఉపాధ్యాయులను ఆదేశించిం ది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న 965 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఉపాద్యాయుల హజరు శాతం పెంచేందుకు బయోమెట్రిక్‌ పద్ధతిని అమ ల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా వారికి ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) కార్డులు జారీ చేయనుంది. ఫొటో చిప్‌ ఉండే ఈ ప్రత్యేక కార్డులను ఉపాద్యాయుల అన్ని రకాల సేవలకు ప్రామాణికంగా తీసుకోనుంది. 

విధులకు హాజరుకాకుంటే..

విధులకు సక్రమంగా హాజరుకాకున్నా,ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనా, మరుసటి రోజు పాఠశాలకు వచ్చి రిజిస్టర్‌లో సంతకం పెట్టినా, సమయానికి పాఠశాలకు చేరుకోకున్నా, పాఠశాల ముగింపు సమయానికి ముందే వెళ్ళిపోయినా, ఆర్‌ఎఫ్‌ఐటీ కార్డుతో జిల్లా అధికారులు ఇట్టే పట్టేస్తారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు ఉన్నాయి.ఉపాధ్యాయులకు కార్డులు జారీ కాగానే కార్డును స్వైప్‌ చేస్తేనే హాజరు నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు.

కార్డులో వివరాలు ఇవే

ప్రభుత్వం జారీ చేసే ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులో ఉపాద్యాయుల పూర్తి వివరాలు పొందపరచనుంది. ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పుట్టిన ప్రాంతం, తేదీ, ప్రస్తుత నివార ప్రాంతం, ఉద్యోగంలో చేరిన తేదీ, ఫోన్‌, ఆధార్‌, పాన్‌ కార్డు నెంబర్లు, బ్లడ్‌ గ్రూపు, పని చేస్తున్న జిల్లా, మండలం, పాఠశాల డైస్‌ కోడ్‌, హోదా, గతంలో ఎక్కడ పని చేశారు, ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు,జీతభత్యాలు, తదితర వివరాలన్నింటిని కార్డులో పొందుపరచనున్నారు. 

ప్రయోజనాలు

కార్డుతో అనేక ప్రయోజనాలున్నాయి. పదోన్నతులు, బదిలీలు వంటి కోసం కార్డులను ప్రామాణికంగా విద్యాశాఖాధికారులు తీసుకోనున్నారు. సాధారణ ఉద్యోగోన్నతులు, బదిలీల సమయాల్లో జరిగే కౌన్సిలింగ్‌, సీనియారిటీ వంటి అంశాల్లో అన్యాయం జరుగకుండా చూస్తుంది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి


ప్రభుత్వం జారీ చేయనున్న ఆర్‌ఎఫ్‌ఐటీ కార్డుల కోసం ఉపాధ్యాయులు ఖచ్చితమైన వివరాలు అందించాలని, యూ డైస్‌లో ఇచ్చిన వివరాలకు తోడు మరింత సమాచారాన్ని సరి చూసుకుని ఈ నెల 30వ తేదీలోపు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఈ సదావకాశాన్ని ఉపాధ్యాయులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధ్యాయులు సమాచారం అందించటంలో అలసత్వం వహించొద్దు.

-పీ కృష్ణయ్య, ఎంఈవో, అశ్వారావుపేట 

హర్షణీయం


ప్రభుత్వమే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించటం హర్షనీయం. గతంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు గుర్తింపు కోసం మండల విద్యాధికారుల నుంచి ధ్రువీకరణ తీసుకోవాల్సి వచ్చేది. ఇక ప్రభుత్వం నేరుగా ప్రత్యేకంగా ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులు అందించటంతో అవే ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఉపయోగపడనున్నాయి. 

-జూపల్లి మురళీ మోహన్‌, ఉపాధ్యాయుడు, దమ్మపేట