ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 17, 2020 , 02:03:18

అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం

అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం

  • ప్రభుత్వ చీఫ్‌ విప్‌ 
  • దాస్యం వినయ్‌భాస్కర్‌
  • 37వ డివిజన్‌లో నీటమునిగిన కాలనీల పరిశీలన

సుబేదారి, ఆగస్టు 16 : ఎవరూ అధైర్యపడొద్దని, కష్టకాలంలో తాను అండగా ఉంటానని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌ వరద బాధితులకు భరోసా ఇచ్చారు. వర్షాలతో నీటమునిగిన 37వ డివిజన్‌లోని జూలైవాడ, నాగేంద్రనగర్‌, విడోస్‌కాలనీని చీఫ్‌విప్‌ కార్పొరేటర్‌ కోరబోయిన సాంబయ్యతో కలిసి పరిశీలించారు. విడోస్‌కాలనీ, నాగేంద్రనగర్‌లో వరద బాధితులు చీఫ్‌ విప్‌కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కాగా, వరద నీరు ఇళ్లలోకి  చేరి ఇబ్బందులు పడుతున్న వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచామన్నారు.ప్రజలు ఎలాంటి సహాయం కావాలన్న స్థానిక కార్పొరేటర్‌ ద్వారా తనకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.