ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 16, 2020 , 00:09:06

ఉగ్ర గోదావరి

ఉగ్ర గోదావరి

  • భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • 46 అడుగులు దాటి ప్రవాహం
  • ముంపు ప్రాంతాల్లో పర్యటించిన  భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి


వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉభయ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి.. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో జన జీవనం స్తంభించింది.. ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో చప్టాలు, బ్రిడ్జిలు  మునిగిపోయాయి.. దీంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.. ఖమ్మంలో మున్నేరు వరద ధాటికి స్థానికులు  జనావాసాలను ఖాళీ చేస్తున్నారు.. పాలేరు జలాశయం 13 ఏళ్ల తర్వాత అలుగుపోస్తున్నది.. కిన్నెరసాని రిజర్వాయర్‌, తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది.. ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై గేట్లు ఎత్తివేశారు.. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం  పెరుగుతుండటంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.   

-నెట్‌వర్క్‌