బుధవారం 23 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 15, 2020 , 07:12:40

ఆనందాల జ‌ల్లు

ఆనందాల జ‌ల్లు

  • n నాలుగు రోజులుగా వదలని ముసురు
  • n పరవళ్లు తొక్కుతున్న ‘కిన్నెరసాని’
  • n భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి
  • n తాలిపేరు నుంచి 23 గేట్ల ద్వారా నీటి విడుదల
  • n చెరువులు, కుంటలకు జలకళ

నాలుగు రోజులైనా ముసురు వీడటం లేదు.. ఎడతెగకుండా వర్షాలు కురుస్తున్నాయి.. పంటలకు ప్రాణం పోశాయి.. చెరువులు అలుగుపోస్తున్నాయి.. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. ఏజెన్సీ జలకళను సంతరించుకున్నది.. మైదాన ప్రాంతాలు జలమయమయ్యాయి.. ఎగువన కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ సామర్థ్యానికి మించి వరద నీరు చేరడంతో ప్రాజెక్టు అధికారులు ఏడు గేట్లు ఎత్తి, తాలిపేరు ప్రాజెక్టుకు 23 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. భద్రాచలం వద్ద 38.5 అడుగులు దాటి గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది..

-నెట్‌వర్క్‌

పాల్వంచ రూరల్‌: మండలంలో ముర్రేడు, కిన్నెరసాని వాగులు మూడు రోజుల నుంచి ఉప్పొంగుతున్నాయి. పట్టణంలోని శ్రీనివాసకాలనీ వద్ద గల బ్రిడ్జి వద్ద మూడు రోజుల నుంచి ముర్రేడు ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహానికి  గట్టు కొతకు గురవుతున్నది. ఈ మార్గం ద్వారా పేట చెరువు, పిల్లవాగు గ్రామాల ప్రజల రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో మండలంలోని దంతెలబోర, బండ్రిగొండ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కిన్నెరసాని గేట్లు మూడు రోజుల నుంచి ఎత్తి ఉంచడంతో వరదప్రవాహం కొనసాగుతూనే ఉంది. యానంబైలు, పాండురంగాపురం, సోములగూడెం, నాగారం, రంగాపురంలోని పొలాల్లో వరదనీరు చేరింది. 

లక్ష్మీదేవిపల్లి: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఈ వరదనీరంతా కిన్నెరసాని పెద్దవాగు ద్వారా కిన్నెరసాని ప్రాజెక్టులోకి చేరుతోంది. పెద్దవాగు, మసివాగు, మొర్రేడువాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వరద నీటితో పంట పొలాలు నీట మునిగాయి. తోకబందాలా, బంగారు చెలక గ్రామాలతో రాకపోకలు నిలిచిపోయాయి. 

సుజాతనగర్‌: మండలంలో కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మూడు రోజులుగు కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. లక్ష్మీదేవిపల్లి తండా నుంచి గరీబ్‌పేట వెళ్లే రహదారి మధ్య ఉన్న చప్టాపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
logo