మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 14, 2020 , 03:17:53

పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

కొత్తగూడెం: పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య ఆదేశించారు. ఆయన గురువారం జిల్లాపరిషత్‌ కార్యాలయంలో స్థాయీసంఘాల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రకృతి వనానికి చెందిన ఎకరం భూమిలో నాలుగువేల మొక్కలు నాటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. పారిశుధ్యం నిధుల కింద జడ్పీకి రూ.49లక్షలు, మండలాలకు రూ.కోటి, పంచాయతీలకు రూ.8.30 కోట్లు మంజూరైనట్లు వివరించారు. వచ్చే నెల నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున విద్యాశాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఐడీసీ ద్వారా మంజూరైన చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశాల్లో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, స్థాయీసంఘాల చైర్మన్లు బిందు చౌహాన్‌, కళావతి, జడ్పీ సీఈవో పురుషోత్తం, డీపీవో రమాకాంత్‌, బరపటి వాసుదేవరావు, పైడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.