గురువారం 22 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Aug 13, 2020 , 02:35:58

సత్తుపల్లి, పెనుబల్లిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

సత్తుపల్లి, పెనుబల్లిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

  • ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

సత్తుపల్లి : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 బెడ్లతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఆక్సిజన్‌ సిలిండర్లు  అందుబాటులో ఉంచుతామని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. బుధవారం ఆయన సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిని పరిశీలించి ఐసొలేషన్‌ వార్డును తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇప్పటి కే సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి 250 యాంటీ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను అందజేశామని, అవసరమైతే మరిన్ని ర్యాపిడ్‌ కిట్లు అందిస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో వైద్యులు, ఏఎన్‌ఎంల కొరత తీర్చేందుకు త్వరలో కొత్తగా పోస్టులు భర్తీ చేస్తామని చె ప్పారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంట నే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆసుపత్రి వైద్యులు సైతం ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మానవతా దృక్పథంతో పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలన్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో మాలతి, డీసీహెచ్‌ఎస్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీడీవో సుభాషిణి, డిప్యూటీ తహసీల్దార్‌ సంపత్‌, మునిసిపల్‌ కమిషనర్‌ సుజాత, చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వసుమతిదేవి, వైద్యులు కిరణ్‌, శివకృష్ణ, కిరణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

కరోనా పట్ల జాగ్రత్తలు అవసరం 

పెనుబల్లి : కరోనా మహమ్మారి పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. పెనుబల్లి వైద్యశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ సెంటర్‌ను ఆయన బుధవారం పరిశీలించారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సీతారామ్‌, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, ఎంపీవో వాల్మీకి కిశోర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నాగరాజు తదితరులున్నారు.logo