శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 13, 2020 , 02:35:50

ఆయకట్టు చివరివరకూ సాగర్‌ జలాలు

ఆయకట్టు చివరివరకూ సాగర్‌ జలాలు

  • సాగునీటి ఇబ్బందులు ఉండొద్దు
  • అన్నదాతలకు అండగా కేసీఆర్‌ ప్రభుత్వం
  • మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • పాలేరు నుంచి నీరు విడుదల

కూసుమంచి : సాగర్‌ జలాల చివరి ఆయకట్టుకూ నీరు అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. పాలేరు రిజర్వాయర్‌ నుంచి బుధవారం ఆయన ఎడమ కాలువ రెండో జోన్‌కు నీటిని విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని, ప్రతి రైతు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాలేరు ఇన్‌ఫాల్‌, అవుట్‌ ఫాల్‌ వివరాలను ఎన్‌ఎస్పీ ఎస్‌ఈ సుమతిని అడిగి తెలుసుకున్నారు. ఆయకట్టు చివరి రైతులకు సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నీరు విడుదల తరువాత రెండో జోన్‌కు విడుదలవుతున్న కృష్ణమ్మ తల్లికి పూలు, పసుపు కుంకుమ వేసి పూజలు చేశారు. నీరు విడుదల అయినందున అధికారులు కాలువలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని మేజర్‌, మైనర్‌ కాల్వలకు నీరు ఇవ్వాలని  ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, రైతుబంధు జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, వ్యవసాయశాఖ డీఏవో విజయనిర్మల, ఈఈ శ్రీనివాసరావు, డీఎస్పీ సామా వెంకటరెడ్డి, డీఈలు ఝాన్సీ, రాణి, ఎంపీపీ బాణోత్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ శిరీష, మండల అధ్యక్షుడు చాట్ల పశురాం, టీఆర్‌ఎస్‌ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, జేఈ నరేందర్‌, ఎన్‌ఎస్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo