మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 11, 2020 , 03:27:29

పల్లె పల్లెకూ పచ్చందం

పల్లె పల్లెకూ పచ్చందం

  • భద్రాద్రి జిల్లాలో 98 శాతం హరితహారం పూర్తి
  • కరోనా నేపథ్యంలోనూ జోరుగా మొక్కలు నాటిన అధికారులు
  • ఫలించిన అన్నిశాఖల సమష్టి కృషి 
  • లక్ష్యం 1,18,14,276.. 
  • నాటిన మొక్కలు 1,15,46,335 

లక్ష్మీదేవిపల్లి: హరితహారం కార్యక్రమం లక్ష్యానికి చేరువైంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ మొక్కలు నాటే కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేస్తున్నాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పచ్చలహారంగా మారుతోంది. 6వ విడత హరితహారంలో అధికారులు మరింత అంకితభావంతో పనిచేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయతీరాలకు చేరుస్తున్నారు. ఈ ఏడాది హరితహారంలో 1,18,14,276 మొక్కలను నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు 1,15,46,335 మొక్కలను నాటారు. దీంతో మొత్తం 98 శాతం టార్గెట్‌ పూర్తయింది. 

జోరుగా మొక్కలు నాటే కార్యక్రమం

కరోనా విస్తరిస్తున్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు మొక్కలు నాటారు. వర్షాలు పడిన అనంతరం 6వ విడత హరితహారాన్ని మొదలుపెట్టారు. కలెక్టర్‌ ఎంవీ రెడ్డి కూడా ఈ హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. కార్యక్రమం ప్రారంభం కాకముందు సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతిరోజూ హరితహారం పురోగతిపై సమీక్షించారు. సమస్యలు ఎదురైన సమయాల్లో తగిన సూచనలు, సలహాలు ఇస్తూ అధికారులను ముందుకు నడిపించారు. ఎక్కడైనా మొక్కల నాటడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే వారిని మందలిస్తూ తక్కువగా నాటేందు కు గల కారణాలను తెలుసుకుంటూ, వాటిని పరిష్కరిస్తూ పూర్తిస్థాయిలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు. 

పూర్తికావచ్చిన లక్ష్యం

ఈ ఏడాది 6వ విడత హరితహారంలో నిర్దేశించిన లక్ష్యం దాదాపుగా పూర్తి కావచ్చింది. 1,18,14,276 మొ క్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 1,15,46,335 మొక్కలను నాటి ఆయా ప్రభుత్వ శాఖలు తమ లక్ష్యాలను చేరుకున్నాయి. 81,09,959 మొక్కలను నాటగా.. 34,36,376 మొక్కలను పంపిణీ చేశారు. ఉ ద్యాన, డీఆర్‌డీఏ, నీటి పారుదల, ట్రైబల్‌ వెల్ఫేర్‌, స ంక్షేమ, మార్కెటింగ్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, మహిళా శిశు సంక్షేమ, రెవెన్యూ, జిల్లా కోఆపరేటివ్‌, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ శాఖలు తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తిచేశాయి. కొ న్ని శా ఖలు లక్ష్యాలకన్నా ఎక్కువగా మొక్కలను నాటాయి. 98 శాతం నాటగా.. దాదాపుగా లక్ష్యం పూర్తయినట్లయింది. 

హరితహారంలో మొక్కలు నాటిన శాఖల వివరాలు..

శాఖ                           లక్ష్యం             నాటింది

అటవీశాఖ                   32,05,000    30,18,333

పోలీస్‌                       50,000          30,683

సింగరేణి                    10,00000      11,48,800

ఉద్యానవనశాఖ            3,00000        3,00000

డీఆర్‌డీఏ                    50,00000      51,04,109

అటవీఅభివృద్ధి సంస్థ      4,32,000       3,90,254

వ్యవసాయ                  1,00000        5,93,223

ఇండస్ట్రీస్‌                    50,000          40,050

పాఠశాల విద్య              30,000          21,684

ట్రైబల్‌ వెల్ఫేర్‌               6,270            6,978

సంక్షేమశాఖ                 1000             1050

ఎస్సీ హాస్టల్స్‌               1000              1059

మున్సిపాలిటీలు            14,68,006      89,912

మార్కెటింగ్‌                 5000              5000

మెడికల్‌ అండ్‌ హెల్త్‌       6000              6000

మహిళా శిశుసంక్షేమశాఖ 6000               6000

పంచాయతీరాజ్‌           500                 400

దేవాదాయశాఖ            2000               -

రెవెన్యూ                    1000               1,424

కో ఆపరేటివ్‌                5,000             5,443

బ్యాంక్స్‌                     500                250

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌        5000             5000

హరితహారం సక్సెస్‌

ఈ ఏడాది హరితహారం గ్రాండ్‌ సక్సెస్‌ అయినట్లు అధికారులు భావిస్తున్నారు. అన్ని శాఖలు కూడా పూర్తిస్థాయి లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. అటవీశాఖకు 32,05,000 మొక్కలు నాటేలా లక్ష్యం కేటాయించగా.. 30,18,333 మొక్కలు నాటి 94 శాతం ల క్ష్యాన్ని పూర్తి చేసింది. సింగరేణి సంస్థకు 10 లక్షల మొ క్క లు నాటేలా లక్ష్యాన్ని కేటాయించగా..11,48,800 మొ క్కలను నాటింది. ఉద్యానవన శాఖకు 3 లక్షల మొక్కల ల క్ష్యాన్ని కేటాయించగా.. అన్ని మొక్కలను నాటారు. డీఆర్‌డీఏకు 50 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా కేటాయించగా.. 51,04,109 నాటారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌కు 6,270 మొక్కలు నాటేలా లక్ష్యాన్ని కేటాయించగా.. 6,978 మొ క్కలను నాటారు. సంక్షేమ శాఖకు, ఎస్సీ హాస్టల్స్‌కు 1000 మొక్కల చొప్పున లక్ష్యాన్ని కేటాయించగా.. లక్ష్యాన్ని చేరుకున్నాయి. మార్కెటింగ్‌ 5వేలు, మహిళా శిశు సంక్షేమ శాఖ 6 వేలు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ 6 వేల చొప్పున తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు మొక్కలు నాటాయి. రెవెన్యూ శా ఖకు 1000 మొక్కలు నాటాలని లక్ష్యంగా కేటాయించగా.. 1,424 మొక్కలను నాటారు. కోఆపరేటివ్‌ సంస్థ 5వేల లక్ష్యానికిగాను 5,443 నాటింది. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌కు కేటాయించిన 5వేల మొక్కలను నాటారు. వ్యవసాయ శాఖ 100000 మొక్కలకుగాను 5,93,223 మొక్కలు నాటింది. దేవాదాయ శాఖ 2000 మొక్కలకుగాను ఇప్పటివరకు ఒక్కటి కూడా నాటలేదు.


logo