గురువారం 01 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Aug 10, 2020 , 00:33:47

రెండు క్వింటాళ్ల గంజాయి పట్టివేత

రెండు క్వింటాళ్ల గంజాయి పట్టివేత

  • భద్రాద్రి పోలీసుల అదుపులో నిందితుడు

భద్రాచలం: భద్రాచలంలో ఆదివారం రూ.30.60 లక్షలు విలువైన 204 కిలోల గంజాయిని  పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. సీఐ తెలిపిన వివరాలు... ఆ గంజాయిని తరలిస్తున్న కారును సీజ్‌ చేశారు. పట్టణ ఎస్సై మహేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు కూనవరం రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటుగా వచ్చిన ఇండిగో మంజా కారు(ఏపీ09సీసీ2789)ను తనిఖీ చేయగా గంజాయి దొరికింది. దీనిని ఏపీలోని చింతూరు మండలం హైదరాబాద్‌కు మహబూబాబాద్‌ జిల్లా గూడూరుకు చెందిన వాంకుడోతు బాలకుమార్‌ తరలిస్తున్నాడు. గంజాయి సహా  కారును సీజ్‌ చేసి, బాలకుమార్‌పై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo