శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 08, 2020 , 03:19:38

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి రుణాలందించాలి : క‌లెక్ట‌ర్‌

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి రుణాలందించాలి : క‌లెక్ట‌ర్‌

కొత్తగూడెం: ఆత్మ నిర్భర్‌ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనల విడుదల చేశారు. ఈ నెల 13వ తేదీ నాటికి వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. వీధి వ్యాపారులను తాను ఆకస్మిక తనిఖీ చేస్తానని, ఆ సమయంలో వారికి గుర్తింపు కార్డులు, రుణాల మంజూరుకు చర్యలు తీసుకోలేదని తెలిస్తే సంబంధిత కమిషనర్లపై చర్యలు తీసుకుంటానన్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో 7904 మంది వీధి వ్యాపారులను గుర్తించామని, ఇంకా ఎవరైనా ఉంటే ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. 

అదనపు కలెక్టర్‌కు అభినందన

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనుదీప్‌ను కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అభినందించారు. శుక్రవారం అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనుదీప్‌ సేవలు మన జిల్లాకు ఎంతో అవసరమని కలెక్టర్‌ చెప్పారు.  

కలెక్టర్‌ను కలిసిన డీపీవో

నూతన డీపీవోగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీరమాకాంత్‌ శుక్రవారం కలెక్టర్‌ను కలిసి పూలమొక్కను అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అంకితభావంతో విధులు నిర్వహించాలని తెలిపారు. 


logo