మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 07, 2020 , 00:56:30

సర్పంచ్‌పై హత్యాయత్నం

సర్పంచ్‌పై హత్యాయత్నం

ఖమ్మం రూరల్‌: మండలంలోని బారుగూడెం సర్పంచ్‌ పల్లెర్ల పాండయ్యపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామ పరిధిలోగల శ్రీసిటీలో నివాసముంటున్న  ఒకరికి మే నెలలో కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయనను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. సర్పంచే క్వారంటైన్‌కు పంపించారన్న కక్షతో పాండయ్యను హత్య చేసేందుకు కరోనా బాధితుడి కుమారుడు పథకం వేశాడు. మాట్లాడే పని ఉందంటూ బుధవారం రాత్రి సర్పంచ్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి కత్తితో దాడి చేశాడు. బాధితుడైన సర్పంచ్‌ ఫిర్యాదుతో నిందితుడిపై ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.