గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 07, 2020 , 00:30:12

అన్ని ఆస్పత్రుల్లో ‘కొవిడ్‌' నిర్ధారణ

అన్ని ఆస్పత్రుల్లో ‘కొవిడ్‌' నిర్ధారణ

కొత్తగూడెం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, పట్టణ-ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 20 నుంచి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కొవిడ్‌-19 టెస్టును అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వైరస్‌ వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ అవగాహనతో స్వీయ నియంత్రణ పాటించాలని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని,

కనీసం రెండు మీటర్లు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌/ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని,  ఒకవేళ కరోనా సోకితే ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని కోరారు. గొంతు నొప్పి, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు, వాంతులు, రుచి తెలియకపోవడం, వాసనను గ్రహించలేకపోవడం, తల నొప్పి, శారీరక నొప్పులు వంటివి ఉంటే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకోవాలని, బయట తిరగకూడదని కోరారు. కరోనా వ్యాధి నిర్ధారిత వ్యక్తి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కూడా లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకుని, పూర్తి స్థాయి చికిత్స పొందుతూ హోం ఐసొలేషన్‌లో తప్పక ఉండాలని సూచించారు.